భూమిలేని వ్యవసాయ కూలీలకు తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద ఏటా రూ,12 వేలు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ఈనెల 26 నుంచి అములు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ నగదును లబ్దిదారుల ఖాతాల్లో రెండు విడతల్లో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలుకు ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.