తెలంగాణలో జనవరి 26 నుంచి అమలుకానున్న రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. 'అందరికి రైతు భరోసా ఇస్తున్నాం. ఐదెకరాలు, పదెకరాలకో కాదు.. ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నింటికీ ప్రతి ఎకరాకు రూ.12,000 ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రజాప్రభుత్వం ప్రకటించింది. పథకం అమలుకు రూ.8,400 కోట్లు రైతుల అకౌంట్లలోకి వెయ్యబోతున్నం' అని వ్యాఖ్యానించారు.