ఒక సాధారణ మహిళ తన రోజువారీ పనితో పాటు పశువులు, కోళ్ల వద్ద శుభ్రం చేయడంతో మొదలై, మేత, నీళ్లు పెట్టి, ఇంటిపనులు పూర్తి చేసుకుని, పొలాలకు వెళతారు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడే పశువులకు మేత కోసుకొస్తారు. పాలు పితికి, వాటికి మేత వేస్తారు. కోళ్లకు మేతవేసి, గూట్లో పెడతారు. ఈ పనులన్నీ వారికి అదనపు శ్రమే. సహజంగా స్త్రీలు ఆదాయం, ఖర్చులు బ్యాలెన్సు చేస్తూ ఆర్థిక సమస్యలు తలెత్తకుండా కుటుంబానికి అండగా నిలుస్తారు.