ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్

50చూసినవారు
ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్
గత రెండేళ్లుగా ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు ఆదేశిస్తానంటూ ఉక్రెయిన్‌కు ఆఫర్ ఇచ్చారు. అయితే అందుకు రెండు షరతులు విధించారు. తమ స్వాధీనంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని, నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని కీవ్‌కు షరతు విధించారు. వీటికి ఒప్పుకుంటే వెంటనే కాల్పుల విరమణ చేస్తామని పుతిన్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్