నల్లమలలో సలేశ్వరం ఆలయం.. ఏడాదిలో మూడు రోజులే దర్శనం

6665చూసినవారు
నల్లమలలో సలేశ్వరం ఆలయం.. ఏడాదిలో మూడు రోజులే దర్శనం
నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవుల్లో సలేశ్వరం ఆలయం ఉంది. చుట్టూ అడవి, కొండలు కోనలు, జలపాతాల మధ్య ఎంతో రమణీయంగా ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుడు లింగం రూపంలో దర్శనమిస్తాడు. చైత్ర పౌర్ణమి రోజు ఈ ఆలయాన్ని తెరుస్తారు. చైత్ర పౌర్ణమి నుంచి 3 రోజుల పాటు జాతర సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఇక్కడ నైవేద్యంగా ఇప్పపువ్వు, తేనెను పెడతారు. దర్శనానికి 3 రోజులే అనుమతి ఉండటంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్