బాబా సిద్ధిఖీ సిద్ధిఖీ హత్యతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. సిద్ధిఖీకి సన్నిహితుడైన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రాణహాని ఉందనే వార్తలు వస్తున్నాయి. గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ తన హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్ పేరును కూడా వెల్లడించాడు. దాంతో అప్రమత్తమైన మహారాష్ట్ర సర్కార్ సల్మాన్ ఖాన్కు భారీ భద్రతను పెంచింది. గత రెండేళ్లుగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు వస్తున్నాయి.