ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ

59చూసినవారు
ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ
మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా మునిపల్లి, పుల్కల్, జోగిపేట్, అందోల్, అల్లాదుర్గంలో  తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన బతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా గురువారం సద్దుల బతుకమ్మ సంబరాలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలు జరుపుకునే బతుకమ్మ పండుగను అల్లాదుర్గం మండలం పరిధిలోని ఆయా గ్రామాల్లో ఉదయం నుండి మహిళలు వివిధ రకాల పూలతో అందంగా  పేర్చి, వివిధ కాలనీలలో బతుకమ్మల చుట్టూ  ఆటపాటలతో, తిరుగుతూ ఆనందోత్సవాలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్