ఈ ప్రిన్సిపల్ మాకు వద్దంటూ శనివారం గురుకుల పాఠశాల విద్యార్థులు గేటు ముందు బైటాయించారు. ప్రిన్సిపల్ కారు తుడిపించడం, వెట్టి చాకిరి చేయించడం, గ్రౌండ్లో ప్రతి ఒక్క పని కూడా పిల్లలతోనే చేయించడం చేస్తుందని, ఇలాంటివి ఎన్నో పనులు ప్రిన్సిపల్ పిల్లలతోనే చేపిస్తున్నారు అని గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మేము పనిచేయడానికి వచ్చామా చదువుకోడానికి వచ్చామా అని పిల్లలు వాపోతున్నారు.