రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

61చూసినవారు
రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి వేళ జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ ఆల్టో కారు గుర్తుతెలియని వ్యక్తిని ఢీ కొట్టి నాలుగు కిలోమీటర్ల మేరకు ఈడ్చుకు వచ్చింది. కంకులు టోల్ ప్లాజా వద్ద కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్