Mar 30, 2025, 13:03 IST/
కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
Mar 30, 2025, 13:03 IST
తెలంగాణలో మరో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సభలో రేషన్ కార్డు లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసి పథకాన్ని మొదలు పెట్టారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందజేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలు కానుంది. దీంతో 3.10 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు.