తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని ఓడిఎఫ్ పరిశ్రమ ఉద్యోగులు మంగళవారం నిర్వహించి నివాళులు అర్పించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్ధుమైలారం ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసిన ఉద్యోగులు ఘన నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ సార్ చేసిన పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు.