Sep 13, 2024, 05:09 IST/
ప్రేమించి పెళ్లి చేసుకున్న కొడుకు, దళిత మహిళను కట్టేసి కొట్టిన కులపెద్దలు
Sep 13, 2024, 05:09 IST
ఏపీలోని కర్నూలు జిల్లాలో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. పెద్దకడుబూరు మండలానికి చెందిన ఈరన్న అనే దళిత యువకుడు.. మరో వర్గానికి చెందిన నాగలక్ష్మీ అనే యువతి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. ఊరి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో యువతి తరపు కులపెద్దలు.. యువకుడి తల్లి గోవిందమ్మను గురువారం రాత్రి కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి, దళిత మహిళను విడిపించారు.