చద్దన్నం ఎంతో ఆరోగ్యకరమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు. "చద్దన్నం డీహైడ్రేషన్, అలసట, బలహీనతలను దూరం చేస్తుంది. దానిలోని పోషకాలు బీపీని తగ్గిస్తాయి. ఎముకల్ని పటిష్ఠం చేస్తాయి. పలు రకాల ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి. శరీర బరువును అదుపులో ఉంచుతాయి." అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి వండిన అన్నంలో మరుసటి రోజు ఉదయం మజ్జిగ లేదా గంజి వేసుకుని ఉల్లిపాయ, మిర్చి కొరుక్కుంటూ తింటే ఆ రుచే వేరు.