ప్రతి బాధిత కుటుంబానికి అండగా సిఎంఆర్ ఎఫ్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగల్ గిద్ద మండలం గౌడ్గామ జన్వాడ గ్రామానికి చెందిన బిరదర్ వీరిశెట్టి ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 16, 000 రూపాయల చెక్కును శుక్రవారం ఖేఢ్ లో టీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ గుణ్వత్ పాటిల్, తదితరులు ఉన్నారు.