రైతు ఇంట్లో 8 కాళ్లతో జన్మించిన గేదె దూడ (వైరల్ వీడియో)

60చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో షాకింగ్ ఘటన జరిగింది. మోద్రా కర్మ చౌరహా గ్రామంలో ఓ రైతు ఇంట్లో ఓ గేదెకు 8 కాళ్లు కలిగిన దూడ జన్మించింది. ఈ వింత దూడను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. రెండు వెన్నుముకలు, 8 కాళ్లు, ఒకే తలతో జన్మించిన ఈ దూడను చూసి అందరూ షాక్ అయ్యారు. కాగా దూడను పరీక్షించిన వైద్యులు జన్యుపరమైన లోపాల కారణంగానే ఇలాంటి దూడలు పుడతాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్