ఔషధ గుణాలున్న తేనెను నీళ్లు, పాలు, గ్రీన్ టీ వంటి వాటిలో కలిపి తీసుకుంటూ ఉంటారు. తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని పదార్థాలతో దాన్ని కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి, తేనె కలిపి తినకూడదు. వేడి నీరు, పాలలో తేనె కలిపితే అందులోని పోషకాలు నశిస్తాయి, విషపూరితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరువెచ్చని నీరు, పాలల్లో కలపాలి. దోసకాయ, తేనె కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి.