కంగ్టి: 10 మందిని బైండోవర్ చేసిన పోలీసులు

74చూసినవారు
కంగ్టి: 10 మందిని బైండోవర్ చేసిన పోలీసులు
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం గాజులపాడు గ్రామంలో ఆదివారం ఇరువర్గాల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో బుధవారం 10 మందిని బైండోవర్ చేసినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. గొడవలో పాల్గొన్న ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి, ప్రతి ఒక్కరికి రూ. 2 లక్షల డిమాండ్‌తో స్థానిక ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలనే ఉదేశ్యంతో పోలీసులు ఇరువర్గాలపై చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్