వ్యక్తిపై జరిగిన హత్య కేసును రెండు రోజుల్లోనే నారాయణఖేడ్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి హత్య వివరాలను ఆదివారం వెల్లడించారు. మండలంలోని ర్యాలమడుగుకు చెందిన మహేష్ ని తన అత్త వీరమణి, మరో వ్యక్తి కిష్టయ్యతో కలిసి హత్య చేశారని చెప్పారు. మహేష్ తప్ప తాగి తరచూ భార్య లావణ్యను వేధించడంపై, అత్త కోపోద్రికురాలై పథకం ప్రకారంగా అల్లుడిని హత్య చేసింది. నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.