నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎంఈఓ విశ్వనాథం గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరును, చదువుతున్న తీరును, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.