ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పి ఆర్ టి యు ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుంటూరు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు మణయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు దేవి సింగ్ పాల్గొన్నారు.