నారాయణఖేడ్ ను ఆదర్శ మున్సిపాలిటీగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వైస్ చైర్మన్ దారం శంకర్ అన్నారు. నాలుగో వార్డ్ కౌన్సిలర్ రాజేష్ చౌహాన్ తో కలిసి కాలనీలో రోడ్లు, మురికి కాలువ పనులను బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పనులు నాణ్యతగా చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.