రాబోయే వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగలను దృష్టిలో ఉంచుకొని నారాయణఖేడ్ పోలీసులు శుక్రవారం అన్ని మతస్తుల పెద్దలతో పోలీస్ స్టేషన్లో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటరెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై విద్యా చరణ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది , వివిధ పార్టీల కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.