నెంబర్ ప్లేట్ లేని వాహనాలు రోడ్లపై కనబడితే సీజ్ చేస్తాం: ఎస్సై

72చూసినవారు
నెంబర్ ప్లేట్ లేని వాహనాలు రోడ్లపై కనబడితే సీజ్ చేస్తాం: ఎస్సై
నెంబర్ ప్లేట్ లేని వాహనాలు రోడ్లపై కనబడితే సీజ్ చేస్తున్నామని ఎస్సై విజయ్ కుమార్ అన్నారు. సోమవారం కంగ్టి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ. కొందరు వాహనదారులు తమ వాహనాలకు నెంబర్ ప్లేట్ తీసివేసి రోడ్లపై తిరుగుతున్నారు. అలాంటి వాహనాలు రోడ్లపై కనబడితే సీజ్ చేసి రవాణాశాఖ అధికారుల వద్దకు పంపిస్తాం అన్నారు. జిల్లా ఎస్పి రూపేష్ ఆదేశాల మేరకు ప్రతిరోజు వాహనాల తనిఖీ నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్