ఏప్రిల్ 19న కశ్మీర్‌కు తొలి వందే భారత్ రైలు

61చూసినవారు
ఏప్రిల్ 19న కశ్మీర్‌కు తొలి వందే భారత్ రైలు
వందేభారత్ సర్వీస్ తొలిసారి కశ్మీర్ లోయలో అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 19న కశ్మీర్‌కు తొలి వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ధృవీకరించారు. నివేదికల ప్రకారం, ఈ రైలు ప్రస్తుతం కాట్రా నుంచి శ్రీనగర్ బారాముల్లా వరకు నడుస్తుంది. ఆగస్టులో జమ్మూ నుంచి శ్రీనగర్ బారాముల్లా నడుస్తుంది. దీని ద్వారా కశ్మీర్ దేశంలోని మిగితా రైల్వే నెట్వర్క్‌కు అనుసంధానించబడుతుంది.

సంబంధిత పోస్ట్