బొల్లారం పట్టణంలోని చర్చిలలో క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. పాస్టర్లు, క్రైస్తవులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను జరిపించారు. కార్మిక నాయకులు వరప్రసాద్ రెడ్డి గాంధీనగర్, చర్చి బస్తీలలోని చర్చిలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రెడ్డి, నవీన్, క్రైస్తవులు పాల్గొన్నారు.