బొల్లారం మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు జ్యోతి నగర్ లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి యువత నాయకుడు ప్రవీణ్ రెడ్డి శుక్రవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజుజ్ కు మద్దతుగా చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. సకలజనుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. కాలనీలో మహిళలతో కలిసి ప్రచార ర్యాలీ నిర్వహించారు.