ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామంలో బిజెపి సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. సభ్యత్వ శాఖ ఇన్ ఛార్జ్ లక్ష్మీనరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.