సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండలంలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. మండల పరిధిలోని మంగంపేట్ , సోలక్ పల్లి, రాళ్లకత్వ, శివనగర్, నల్తూర్, గడ్డపోతారం, వావిలాల తదితర గ్రామాలలో శుక్రవారం ఉదయం 17డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 76%గా ఉంది. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.