సుల్తాన్పూర్ లో కంపెనీని సందర్శించిన మంత్రులు

64చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం సుల్తాన్పూర్ లోని మెడికల్ డివైస్ పార్కులో ఎక్స్టెనీ స్టెంట్ కంపెనీని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంగళవారం సందర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో స్టెంట్ కంపెనీ ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు తెలిపారు. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఈ కంపెనీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్