సంగారెడ్డి జిల్లాలో అక్రమ గ్యాస్ రిఫిల్లింగ్ కేంద్రాలపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు జరిపి నలుగురు నిందితులతో పాటు, 840 సిలిండర్లు, 9-గూడ్స్ వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ గురువారం తెలిపారు. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో రోహన్ ట్రేడర్స్ పై, ఇస్నాపూర్ గ్రామం సాయి కాలనీకి చెందిన మాదిరి రవీందర్ అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి స్వాధీన పరుచుకున్నారు.