సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీలో పార్కు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు వ్యక్తులు 1200 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు పార్కు స్థలాన్ని కాపాడాలని కోరారు.