వసతి గృహ విద్యార్థులకు మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ అన్నారు. అల్లాదుర్గంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని మంగళవారం రాత్రి అకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు.