మల్కాపూర్ పెద్ద చెరువులో భవనం కూల్చివేతలో గాయపడిన హోంగార్డు గోపాల్ కు మెరుగైన వైద్యం అందుతుందని జిల్లా పోలీసు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దుర్గారెడ్డి మంగళవారం తెలిపారు. ఎస్పీ రూపేష్ దగ్గరుండి హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారని చెప్పారు. పోలీస్ శాఖ అతనికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.