ఛత్రపతి శివాజీ మహారాజ్ 393వ జయంతి సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బై పాస్ రోడ్డు శివాజీ చౌక్ వద్ద ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు శివాజీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం దేశం లో వలస వచ్చిన పాలకులపై వందలాది పోరాటాలు చేశారన్నారు. తన సామ్రాజ్యం లోని ప్రజా హక్కుల కోసం.. వివక్ష లేని పాలన కోసం ముఖ్యంగా చిన్న సన్న కారు రైతుల కోసం పన్ను శిస్తులు రద్దు సంస్కరణలు తెచ్చి నిరుపేద ప్రజలకు న్యాయం చేసిన పాలకుడిగా చరిత్రలో నిలిచారని కొనియాడారు. శత్రవులపై ఆయన చేసిన పోరాటలు, సాహసలు నేటి యువత స్ఫూర్తి పొంది సమాజంలో జరుగుతున్న రాజకీయ అవినీతి, సామాజిక వివక్షలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో ఫోరమ్ ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సహాకార్య దర్శి గడ్డం పాండు రంగం, చాకలి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.