సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో ధనుర్మాసం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. అర్చకులు పూలతో నృత్యాలు చేస్తూ వెంకటేశ్వర స్వామి నామాన్ని జపించారు. అనంతరం గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.