కొండాపూర్ మండలం మారేపల్లి లోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో దీపావళి వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆలయంలో భక్తులు దీపాలను ప్రత్యేకంగా వెలిగించారు. విద్యుత్ దీపాలతో దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపించారు. దీపావళి పండగ విశిష్టతను భక్తులకు అర్చకులు వివరించారు.