గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వంటకు నాసిరకం సరుకులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ కమిషనర్ మురళి హెచ్చరించారు. కొండాపూర్ మండలం గిర్మాపూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను గురువారం అకస్పకంగా పరిశీలించారు. గురుకుల పాఠశాలలో ఉన్న బియ్యం, నిత్యవసర వస్తువులను చూశారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి ఉన్నారు.