జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలాల్లో మధ్యాహ్న భోజన కమిటీలు వేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ప్రకటనలో తెలిపారు. కమిటీలో ఓ ప్రధానోపాధ్యాయునితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని పేర్కొన్నారు. ఈ కమిటీ సభ్యులు ప్రతిరోజు మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు.