ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు

169చూసినవారు
ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు
మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి సందర్బంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు. ఈ సందర్భంగా ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వమే దేశంలో అట్టడుగు వర్గాల కోసం విద్య సామజిక హక్కుల కార్యక్రమలు చేపట్టి అట్టడుగు వర్గాలకు సామజిక న్యాయం, విద్య అవకాశలు కల్పించడం ద్వారా సామాజిక అభివృద్ధి వస్తుంది అని, తాను నమ్మిన సిద్ద్ధాంతం కోసం అగ్ర వర్గాల పై పోరాటం చేసి మరి అట్టడుగు వర్గాల సామజిక న్యాయం మరియు చైతన్యం కోసం కృషి చేసిన మహా నీయుడు మహాత్మా పూలే ఆశయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి సమా సమాజ నిర్మాణం కోసం పూలే జీవితం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి లు శ్రీకాంత్, పాండు రంగం, కార్య వర్గ సభ్యులు సాయి వరాల, వీర శైవ లింగాయత్ జిల్లా నాయకులు మల్లి కార్జున్ పాటిల్, తుమ్మల పల్లి పృథ్వి రాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్