తారా ప్రభుత్వ కళాశాలలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమం

361చూసినవారు
తారా ప్రభుత్వ కళాశాలలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమం
తారా ప్రభుత్వ కళాశాల సంగారెడ్డిలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ టూ త్రీ ఫోర్ మరియు ఎన్ సి సి ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రీయ ఏక్తా దివాస్ ను నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు స్వతంత్ర భారత దేశ ప్రథమ హోం శాఖ మంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని తమ కళాశాల విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగినది తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో సుమారు 500 పైగా సంస్థానాలు భారత సమాఖ్యలో విలీనం చేసిన ఘనత సర్దార్ పటేల్ అదేవిధంగా 1948 సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత సమాఖ్యలో విలీనం చేయడంలో పటేల్ పాత్ర అమోఘం అని తెలిపారు. పటేల్ ఆశయాలు సాధనకు మనమందరం దేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం ప్రవీణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేందర్, డాక్టర్ వెంకటేశం, ఎన్ ఎస్ ఎస్ అధికారులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ పద్మజా, ఎన్సిసి అధికారి మనోజ్ కుమార్, అధ్యాపకుల బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్