సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివలింగానికి రుద్రాభిషేక కార్యక్రమాన్ని వేదమంత్రాలతో జరిపించారు. భక్తులే శివలింగానికి అభిషేకం చేసే అవకాశాన్ని కల్పించారు. అనంతరం స్వామివారికి మహా నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.