సంగారెడ్డి జిల్లా నుంచి ఇన్స్పైర్లో 9 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. సంగారెడ్డిలో జరిగిన ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రశంసపత్రాలు, బహుమతులు అందించారు. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు.