సంగారెడ్డి పట్టణం శ్రీనగర్ లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహ స్వామి మూర్తులకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరిపించారు. అర్చకులు వేదమంత్రాలతో స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.