జిల్లాలో బిజెపి బలోపేతానికి కృషి చేద్దామని మహిళ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మీనాక్షి గౌడ్ అన్నారు. సంగారెడ్డిలోని గంజి మైదానంలో పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి పార్టీ సభ్యత్వానికి మంచి స్పందన వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు.