ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ధరణి, ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ చంద్రశేఖర్ శిక్షణకలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.