సంగారెడ్డి: కార్మిక సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వం

67చూసినవారు
సంగారెడ్డి: కార్మిక సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని మరచిపోయిందని బిఎంఎస్ జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి విమర్శించారు. సంగారెడ్డి లోని సంఘ భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా ఏడాది నుంచి పథకాలు అందడం లేదని విమర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం బిఎంఎస్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్