భవాని భువనేశ్వరి దేవాలయంలో పూజలు

65చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని భవాని భువనేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం మొదటి మంగళవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను చేశారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను జరిపించి అమ్మవారికి ఓడిబియ్యాన్ని సమర్పించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేశారు.

సంబంధిత పోస్ట్