Feb 26, 2025, 11:02 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి: సెల్ టవర్ నిర్మాణ పనులు ఆపకుంటే ఆందోళన చేస్తాం
Feb 26, 2025, 11:02 IST
సంగారెడ్డి 12వ వార్డు పరిధిలోని ద్వారకానగర్ లో సెల్ టవర్ నిర్మాణ పనులు ఆపకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డిలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. సెల్ టవర్ ఏర్పాటు వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.