తెలంగాణలో ఏప్రిల్ నెల నుంచే భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. శాస్త్రీయంగా, ప్రజల అభిప్రాయాల మేరకే చట్టాన్ని తెచ్చామని అసెంబ్లీలో తెలిపారు. 10,954 రెవెన్యూ గ్రామాల్లో గ్రామ పాలన అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ధరణి ఓ దుర్మార్గమైన చట్టమని.. ఒక్క కలం పోటుతో భూ హక్కులు కాలరాసే చట్టమని డిప్యూటీ సీఎం భట్టి విమర్శించారు. ధరణిని బంగాళా ఖాతంలో వేసి భూభారతి తెచ్చామన్నారు.