నేడు సంగారెడ్డి జిల్లాకు రానున్న హరీశ్‌రావు

69చూసినవారు
నేడు సంగారెడ్డి జిల్లాకు రానున్న హరీశ్‌రావు
సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో ఫార్మాసిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అండగా నిలవనున్నారు. ఫార్మాసిటీకి భూములిచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పినా ప్రభు త్వం నిరంకుశంగా భూసేకరణకు సిద్ధమవుతుండటంతో రైతులకు బాసటగా నిలిచి వారి ఆందోళనలో పాల్గొనేందుకు హరీశ్‌రావు గురువారం న్యాల్‌కల్‌ మండలం డప్పూరుకు రానున్నారు.ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్న భూములను పరిశీలించనున్నారు.

సంబంధిత పోస్ట్